News November 4, 2025

నాలాను పరిశీలించిన మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించి నాలాను పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు వారు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేయర్ సూచనలు చేశారు.

Similar News

News November 4, 2025

భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్‌తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 30. నవంబర్ 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.

News November 4, 2025

‘ది రాజాసాబ్’ విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

image

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News November 4, 2025

మెదక్: మరి కాసేపట్లో భారీ వర్షం

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని.. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.