News March 4, 2025
నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడుది విజయనగరంలోని బాబామెట్ట. 1996లో చాకలిపేట పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. పదేళ్ల సర్వీసు అనంతరం 2006లో జాబ్‌కు రిజైన్ చేశారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఓడిపోయిన ఆయన.. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు.
Similar News
News March 4, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తిధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.40 పెరిగింది. దీంతో రూ.6,920 జెండా పాట పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
News March 4, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News March 4, 2025
మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం: WGL కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉ.10 గం.లకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మహిళలు పాల్గొని పరీక్షలు చేయించుకోవాలన్నారు.