News February 3, 2025

నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి

image

నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ పూర్తి చేస్తామని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ. పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి రైల్వే లైన్‌ను గతేడాది అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు గుర్తు చేశారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో లైన్ కలుపనుంది.

Similar News

News February 4, 2025

నులిపురుగుల నివారణ పోస్టర్లు ఆవిష్కరించిన గుంటూరు కలెక్టర్

image

ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం నులిపురుగుల నిర్మూలన పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. 1 నుంచి 19సం.ల పిల్లలకు 400mg ఆల్బెండజోల్ బిళ్ళలను చప్పిరించి మింగించాలని, ఒకటి నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మజిదా బేగం, శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News February 3, 2025

గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు

image

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరంటి వర ప్రసాద్(TDP), కొమ్మినేని కోటేశ్వరరావు(TDP), నూకవరపు బాలాజీ(TDP), ముప్పవరపు భారతి(TDP), షేక్ మీరావలి(TDP), దాసరి లక్ష్మి దుర్గ(జనసేన).

News February 3, 2025

GNT: SI అంటూ బెదిరించి రూ.24లక్షలు స్వాహా

image

ఎస్ఐ అంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలు దోచేసిన వైనంపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెహ్రు నగర్‌కి చెందిన నాగేశ్వరరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్ఐ ప్రసాద్‌ను అని చెప్పాడు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నాడు. ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని నాగేశ్వరావుని బెదిరించి విడతల వారీగా రూ.24లక్షలు నకిలీ ఎస్ఐ ఖాతాలోకి జమ చేయించుకున్నాడు.