News January 1, 2026

నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in

Similar News

News January 2, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 2, 2026

మన మిలిటరీ స్థావరాలపై పాక్ ఫేక్ ప్రచారం!

image

పాక్ మరోసారి తన నక్క బుద్ధి చూపించింది. ప్రో పాకిస్థాన్ SM అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. గతేడాది మే నెలలో యుద్ధం సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌బేస్, బియాస్‌లోని బ్రహ్మోస్ స్థావరంపై దాడి చేసినట్లు ఆయా అకౌంట్లలో పోస్టులు చేశారు. దాడికి ముందు, తర్వాత అంటూ తప్పుడు చిత్రాలను షేర్ చేశారు. కానీ ఆ నిర్మాణాలు ఎప్పటిలానే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్వతంత్ర నిపుణులు తేల్చారు.

News January 2, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 02, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.