News March 15, 2026

నావిక్‌కు అంతరాయం

image

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.

Similar News

News March 27, 2026

పాండ్య గోల్డెన్ హార్ట్❤️

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మంచి మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ముంబైలోని వాంఖడే గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు అందించారు. టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడేలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. అప్పుడు తనకు సపోర్ట్ చేసిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పాండ్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News March 27, 2026

సీఎంలతో నేడు ప్రధాని మోదీ సమావేశం

image

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో PM మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత జరుగుతున్న మొదటి మీటింగ్ ఇదే. యుద్ధ ప్రభావం వల్ల తలెత్తే ఇంధన కొరత, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో రాష్ట్రాల సన్నద్ధతపై ఇందులో చర్చించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని రాష్ట్రాల సీఎంలు ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు.

News March 27, 2026

ఈ టైమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తే గుండె సేఫ్!

image

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేసే టైమింగ్ ముఖ్యమని తాజా స్టడీలో తేలింది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వర్కౌట్ చేసేవారికి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించింది. దీనివల్ల ఒబెసిటీ 35%, గుండె జబ్బులు 31%, షుగర్ రిస్క్ 30% తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఉదయం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం, కొవ్వు త్వరగా కరగడం దీనికి కారణాలు.