News August 2, 2024
నా కళ్లు చెమ్మగిల్లాయి: ఎమ్మెల్యే RRR

ఉండి నియోజకవర్గంలో మొదటి రోజే 99శాతం ఫించన్ల పంపిణీ చేశామని MLA రఘురామకృష్ణరాజు (RRR) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, అందుకోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పెంచిన ఫించన్ రూ.4,000 అందుకున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని ఆయన అన్నారు.
Similar News
News February 5, 2026
ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

భీమవరంలోని లోసరి రోడ్డులోని విష్ణు కన్వెన్షన్‌లో గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి పన్నులు, పన్నేతర వసూలు, వర్మి కంపోస్ట్ తయారీ, అందుబాటులో ఉన్న ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలు, అంశాలపై సమీక్షించారు. పన్నుల వసూలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 5, 2026
లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు..!

జిల్లాలోని పలు లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి పడితే వారికి గదులు అద్దెకు ఇస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొగల్తూరులో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న లాడ్జిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 5, 2026
ప.గో: మాజీ సీఎం జగన్ పర్యటన ఇలా!

శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 5న భీమవరం రానున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.25 గంటలకు రాధాకృష్ణ కన్వెన్షన్ హాలుకు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


