News December 29, 2024

నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్

image

మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. తాను మరాఠీ అయినా తన పిల్లల్ని మాత్రం తెలుగులోనే చదివిస్తున్నానన్నారు. సంస్కృతి, వారసత్వం అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయని, ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావట్లేదన్నారు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 1, 2025

అనంతపురంలో కిలో టమాటా రూ.9

image

అనంతపురంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో టమాటా రూ.9 పలికింది. సరాసరి ధర రూ.6, కనిష్ఠ ధర రూ.4తో విక్రయాలు జరిగాయి. టమాటా కోత కూలీలు, ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
➤ ఇక చీనీ ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నిన్న టన్ను గరిష్ఠంగా రూ.27,420 తో అమ్ముడయ్యాయి.

News January 1, 2025

ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగింపు

image

ఎస్సీ కుల గణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

News December 31, 2024

పుట్టపర్తి సాయి బాబా సన్నిధిలో సాయి పల్లవి

image

సినీ నటి సాయి పల్లవి పుట్టపర్తికి వచ్చారు. శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి దర్శనంలో పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించారు. హారతి కార్యక్రమం అనంతరం మహా సమాధిని దర్శించుకున్నారు. పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసి ఆకట్టుకున్నారు. గతేడాది కూడా ఇదే సమయంలో బాబాను దర్శించుకున్నారు.