News October 16, 2025
నా రక్తంలోనే కాంగ్రెస్ ఉంది: MLA కోమటిరెడ్డి

నేను జన్మతః కాంగ్రెస్ పార్టీ వాడిని, నారక్తంలోనే కాంగ్రెస్ ఉంది, పార్టీలోనే ఉంటానని MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. DCC అధ్యక్షుడి ఎంపికపై మునుగోడులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్తులు అమ్ముకొని కష్టకాలంలో పార్టీని బతికించడానికి పనిచేశాన్నారు. దశాబ్దాలుగా మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో AICC మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మొహంతి పాల్గొన్నారు.
Similar News
News October 17, 2025
రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్‌లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్‌లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.
News October 17, 2025
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం భగభగలు

అంతర్జాతీయ మార్కెట్(COMEX)లో బంగారం ధరలు రికార్డులు తిరగరాస్తున్నాయి. నిన్న ఔన్సు $4250 ఉండగా, ఇవాళ అది $4300 దాటేసింది. అంతేకాకుండా మార్కెట్ క్యాప్ విలువ $30 ట్రిలియన్స్ క్రాస్ అయింది. ఒక అసెట్ ఈ మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. US-చైనా ట్రేడ్ వార్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ అసెట్‌గా భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
News October 17, 2025
కావేరి నదీ ఎలా పుట్టిందంటే?

పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుని కుమార్తె అయిన కావేరిని, కావేర ముని దత్తత తీసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న అగస్త్య మహాముని, దైవ చర్చలలో మునిగి, ఆమెను నిర్లక్ష్యం చేశాడు. దీంతో అసహనానికి గురైన ఆమె అగస్త్య ముని స్నానపు తొట్టిలో పడిపోయింది. అనంతరం కావేరి నదిగా జన్మించింది. ప్రజలకు మేలు చేయాలనే తన లక్ష్యాన్ని కావేరి ఇలా నేరవేర్చుకుంది. కార్తీక మాసంలో ఈ నదిలో స్నానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.