News April 22, 2025

నా రాజకీయ నిర్ణయం సరైనదే: ఎమ్మెల్యే తెల్లం

image

నియోజక అభివృద్ధి కోసం తాను తీసుకున్న రాజకీయ నిర్ణయం సరైనదేనని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం మండలంలో పర్యటించి మాట్లాడారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమిలేదని విమర్శించారు. భద్రాచలం అభివృద్ధికి రూ. 100 కోట్లు నిధులిస్తామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. భద్రాద్రికి అభివృద్ధికి తొలి విడతగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 34 కోట్లు మంజూరు చేసిందన్నారు.

Similar News

News April 22, 2025

జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా…!

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం బాన్సువాడ, రామారెడ్డిలో అత్యధికంగా 43.6, మద్నూర్‌లో 43.4, పాల్వంచ, కామారెడ్డి, బిచ్కుంద లలో 43.3, గాంధారిలో 43.1, బిక్కనూరులో 43.0. అత్యల్పంగా నాగిరెడ్డిపేట్ మండలంలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, అవసరమైతే తప్ప బయట తిరగవద్దు అని అధికారులు సూచిస్తున్నారు.

News April 22, 2025

సిరిసిల్ల: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలి

image

యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిలజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News April 22, 2025

విశాఖలో పౌష్టికాహార ముగింపోత్సవాలు

image

విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరినాలో పౌష్టికాహార ముగింపోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!