News March 20, 2025
నా రాజీనామాను ఆమోదించండి: ఎమ్మెల్సీ పద్మశ్రీ విజ్ఞప్తి

శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు. గతేడాది ఆగస్టు 30న తన రాజీనామా లేఖను శాసనమండలి స్పీకర్‌కు అందించిన ఇంతవరకు ఆమోదించలేదని నా రాజీనామా ఆమోదించి నన్ను పదవి నుంచి తప్పించండి అంటూ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు బుధవారం జరిగిన మండలి సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 20, 2025
HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జై వ్యక్తి మృతి

మామునూరు పోలీసు స్టేషన్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి రోడ్డుపై నుజ్జునుజ్జై అయ్యి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ టీ షర్ట్, నల్లటి ప్యాంట్, చెప్పులు ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆక్సిడెంట్ ఎలా జరిగిందని ఎంక్వైరీ చేస్తున్నట్టు స్టేషన్ ఎస్ఐ కృష్ణవేణి పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
రైల్వేజోన్‌ను YCP ఖాతాలో వేసుకోవడం దారుణం: పయ్యావుల

AP: విశాఖలో PM మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల ఘనత YCPదే అని మండలిలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడంతో మంత్రులు మండిపడ్డారు. కనీసం రైల్వేజోన్‌కు భూమి ఇవ్వకుండా ప్రధాని శంకుస్థాపనను YCP తమ ఖాతాలో వేసుకుంటోందని పయ్యావుల విమర్శించారు. గత ప్రభుత్వం విధ్వంసానికి అమరావతే సాక్ష్యమన్నారు. గత ప్రభుత్వమే భూమి ఇచ్చి, క్లియరెన్స్‌లు తెస్తే శంకుస్థాపన ఎందుకు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.
News March 20, 2025
వంశీకి మూడు రోజుల సీఐడీ కస్టడీ

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సీఐడీ కోరగా 3వ ఏసీజేఏం కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది. దీంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని కార్యాలయంలో ఆయన్ను విచారించనున్నారు. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళే విచారణ జరగనుంది.