News December 25, 2025
నా వీర్యంతో పిల్లలను కంటే ఖర్చునాదే: దురోవ్

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. 37ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న వాళ్లు తన వీర్యం ద్వారా IVFతో పిల్లలను కంటే ఖర్చులు భరిస్తానని ప్రకటించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఆయన ఇప్పటికే వంద మందికిపైగా పిల్లలకు తండ్రిగా ఉన్నారు. ఈ నిర్ణయంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అలాగే ఆయన తన ఆస్తి మొత్తాన్ని తన పిల్లలకు సమానంగా పంచుతానని గతంలోనే ప్రకటించారు.
Similar News
News December 25, 2025
ఐదు భాషల్లో ‘ధురంధర్-2’ విడుదల

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీకి పార్ట్-2 రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 19న రానున్న ‘ధురంధర్-2’ను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ పేర్కొంది. కాగా ధురంధర్ 20 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.640.20 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని తెలిపింది.
News December 25, 2025
ఫ్రెషర్లకు రూ.21 లక్షల జీతం.. ఇన్ఫోసిస్ డ్రైవ్!

దేశంలో మేజర్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల కోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.7-21 లక్షల వరకు ప్యాకేజీ ఉండే అవకాశం ఉందని మనీ కంట్రోల్ తెలిపింది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (లెవెల్ 1-3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ) పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, EEEలో BE, BTech, ME, MTech, MCA చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు వివరించింది.
News December 25, 2025
21 లక్షల Sft విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం

AP: అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ‘21 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును నిర్మిస్తున్నాం. 8వ అంతస్తులో CJ కోర్టు, 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లుంటాయి. 2027 నాటికి పనులు పూర్తవుతాయి’ అని వివరించారు. గత ప్రభుత్వం వల్ల పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ఆయన ఇవాళ ప్రారంభించారు.


