News August 13, 2025
నిండుకుండలా లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

సాత్నాల ప్రాజెక్టు కుడి కాల్వ కింద జైనథ్ మండలంలో ఉన్న లక్ష్మీపూర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7,600 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటం, సాత్నాల కుడి కాలువ నుంచి లక్ష్మీపూర్ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతుండడంతో అలుగు పారే అవకాశం ఉంది.
Similar News
News August 14, 2025
ADB: ఫలితాలు విడుదల.. నలుగురే PASS

జిల్లాకేంద్రంలోని టీటీడీసీలో 50 రోజుల లైసెన్స్ సర్వేయర్స్ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. శిక్షణ పూర్తి అనంతరం గత నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. కాగా వాటి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. 155 మందికి కేవలం నలుగురే పాస్ అయ్యారు. 100కి 60 శాతానికి పాస్ పర్సంటేజ్ కావడంతో దానిని 50 శాతానికి తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
News August 14, 2025
ADB: ‘సీఐ కరుణాకర్ సేవలు అభినందనీయం’

ADB టూ టౌన్ సీఐగా కరుణాకర్ రావు అందించిన సేవలు అభినందనీయమని డీఎస్పీ జీవన్‌రెడ్డి కొనియాడారు. బుధవారం సాయంత్రం ఘన్‌పూర్ సర్కిల్‌కు బదిలీపై వెళ్తున్న కరుణాకర్ రావుకు డీఎస్పీతో పాటు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై విష్ణుప్రకాష్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కరుణాకర్‌రావు తీసుకున్న చర్యలు అమోఘమని ప్రశంసించారు.
News August 13, 2025
రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. 5th షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని ఎంపీ కోరారు. స్పందించిన గవర్నర్ వర్షాకాలం తర్వాత టూర్ పెడతానని తెలిపారన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగ సంఘ బాధ్యులు గిరిజన ప్రాంత సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు.