News April 16, 2025
నిందితుడికి జీవిత ఖైదు.. పోలీసులకు సత్కారం

వరంగల్ కమిషనరేట్ పరిధి గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడటంతో కృషి చేసిన వారిని డీసీపీ అంకిత్ కుమార్ సత్కరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, మర్రి వాసుదేవ రెడ్డి, భరోసా లీగల్ అడ్వైజర్ నీరజ, ఏసీపీ తిరుపతి, ఇన్‌స్పెక్టర్ బాబూలాల్, మహేందర్, హెడ్ కానిస్టేబుల్ విజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, యుగంధర్‌ను ఆయన అభినందించారు.
Similar News
News April 16, 2025
వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
News April 16, 2025
కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.
News April 16, 2025
పంగులూరు: ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

పంగులూరు మండలంలోని కోటపాడు, ముప్పవరం గ్రామాల మధ్య మంగళవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కోటపాడుకు చెందిన గోళ్ళమూడి అంజయ్య(50) రాత్రి ముప్పువరం నుంచి ట్రాక్టర్‌పై కోటపాడు బయలుదేరారు. ఆదిరెడ్డి బావి సమీపంలో మలుపు దగ్గరకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌పై ఉన్న అంజయ్య కిందపడి అక్కడికక్కడే మరణించాడు.