News January 11, 2026

నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్

image

గ్రేటర్ నోయిడాలో (UP) జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్స్‌ సాధించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్.. 2023 ప్రపంచ ఛాంపియన్ నితూ ఘాంగాస్‌ను ఓడించి తన మూడో నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మరోవైపు హుసాముద్దీన్ 60KGల విభాగంలో సచిన్ సివాచ్‌పై విజయం సాధించారు. 75KGల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.

Similar News

News February 6, 2026

శుక్ర జపం ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటి?

image

శుక్ర జపాన్ని ప్రశాంత ప్రదేశంలో చేయాలి. వీలైతే తెల్లని దుస్తులు ధరించాలి. ఇందుకు ఉదయం/సాయంత్రం వేళలు అనుకూలం. కళ్లు మూసుకుని మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. 108 పూసల జపమాల ఉంటే దాని సాయంతో వాటిని లెక్కిస్తూ జపించాలి. ఈ సాధనతో అంతర్గత మార్పు మొదలవుతుంది. క్రమంగా నిర్ణయాలు మెరుగుపడతాయి. బంధాలు బలపడతాయి. ఈ ప్రక్రియ మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. బయట ప్రపంచపు ఆనందాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.

News February 6, 2026

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశం: ట్రంప్

image

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. తన మొదటి పదవీకాలంలో కొత్త, పునరుద్ధరించిన అణ్వాయుధాలతో మిలిటరీని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో చాలా కాలం పాటు నిలిచే ఉండేలా అధునాతన, నూతన ఒప్పందంపై న్యూక్లియర్ నిపుణులు పనిచేయాలన్నారు. భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధాలను ఆపినట్లు మరోసారి గొప్పలు చెప్పారు.

News February 6, 2026

రంగులు మారే శివలింగం.. ఎక్కడంటే?

image

తమిళనాడులోని తంజావూరు(D), నల్లూర్‌లో ఉన్న కల్యాణ సుందరేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 5 రంగులు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ) మారుతాయి. 1,000 ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో శివుడిని, మురుగన్‌ను కొలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో బంగారంతో అలంకరించిన శివలింగం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద గంధపు అభిషేకం చేసే మరో లింగం ఉంటాయి.