News December 31, 2024
నిఘా నీడలో విశాఖ..!

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా రద్దీగల ప్రాంతాలతో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, అడవివరం, బీఆర్డీఎస్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాలలో నిఘా పెంచారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను పహారా పెట్టారు.
Similar News
News September 15, 2025
జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 111 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 111 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 02, రెవెన్యూ 11, ప్రజారోగ్యం 13, పట్టణ ప్రణాళిక 51, ఇంజినీరింగు 28, మొక్కల విభాగమునకు 03, యుజీడీ విభాగమునకు 03 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.
News September 15, 2025
విశాఖలో ఆరుగురు సీఐలు బదిలీ

విశాఖ సిటీలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. MVP సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావును రేంజ్‌కు సరెండర్ చేశారు. ద్వారక సర్కిల్ ట్రాఫిక్ CI కేఎన్వి ప్రసాద్‌ను ఎంవీపీకి, పోలీస్‌కంట్రోల్ రూమ్ సీఐ ఎన్.విప్రభాకర్‌ను ద్వారకా ట్రాఫిక్‌కి బదిలీ చేశారు. సిటీ వీఆర్ సీఐ చంద్రమౌళిని వెస్ట్ జోన్ క్రైమ్‌కు. సిటీ విఆర్ భాస్కరరావును కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు.