News December 29, 2024

నిఘా నీడలో హైదరాబాద్!

image

మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులను ఆదేశించారు.

Similar News

News December 29, 2024

HYD: ఆగాల్సిందే.. 15 నిమిషాల ముందే ప్రకటన..!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే రైళ్లు ఏ ఫ్లాట్ ఫాం వైపు వస్తాయనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. అప్పటి దాకా ప్రయాణికులు ఆగాల్సిందే. ఎటు వస్తుందో..? తెలియక ప్రయాణికులు ఎంట్రన్స్ బోర్డు వద్దకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కోసారి చివరి క్షణంలో ఫ్లాట్ ఫాం నంబర్ మారుతోంది. పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న వేళ, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

News December 29, 2024

మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లలేదా.. నేడే ఆఖరు!

image

చినిగిన చొక్కా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక మంచి పుస్తకం కొనకుంటే, నీ జీవితమంతా అజ్ఞానమే అన్నారు మరికొందరు మేధావులు. అందుకేనేమో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బుక్ ఫెయిర్ – 2024 నిరంతరం పుస్తక ప్రియులతో నిండుగా కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. మరి మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లారా..? అక్కడ ఏ పుస్తకం కొన్నారో కామెంట్ ప్లీజ్..!

News December 29, 2024

జూబ్లీహిల్స్‌లో 4 పబ్‌లకు అనుమతి లేదు!

image

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.