News October 12, 2025
నిజమాబాద్: రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి..!

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో ఇటీవల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు హై కోర్టు బ్రేక్ వేయడంతో ప్రజావాణి యథావిధిగా జరగనుంది.
Similar News
News October 12, 2025
NZB: DCC పదవికి దరఖాస్తు చేసుకున్న అయ్యప్ప శ్రీనివాస్

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ పదవి కోసం ఆర్మూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. జంబి హనుమాన్ ఆలయ ఛైర్మన్ రేగుల్ల సత్యనారాయణ తదితరులున్నారు.
News October 12, 2025
NZB: యథావిధిగా ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
News October 11, 2025
నిజామాబాద్ డీసీసీ కొత్త బాస్ ఎవరో?

పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆశవాహుల నుంచి ఈ నెల 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే రిజ్వన్‌ను నియమించారు. అయితే ఏడేళ్లుగా మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 15 రోజుల్లో జిల్లాకు కొత్త అధ్యక్షున్ని నియమించే అవకాశం ఉంది.