News April 6, 2025

నిజాంపట్నం: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

image

రొయ్యల చెరువులో ఫ్యాన్ తిరగకపోవడంతో పరిశీలించడానికి వెళ్లి వెంకటరెడ్డి మృతి చెందిన ఘటన ఆదివారం నిజాంపట్నంలో చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. కర్లపాలెం మండలం పెదపులుగు వారిపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి నిజాంపట్నంలో రొయ్యల చెరువు వద్ద పనిచేస్తుంటాడు. చెరువులో ఫ్యాన్ తిరగకపోవడంతో పరిశీలించడానికి వెళ్లిన ఆయన కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 8, 2025

KMR: బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

image

ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు.

News April 8, 2025

విద్యార్థులకు ట్రంప్ ఝలక్.. చిన్న తప్పు చేసినా వీసా రద్దు?

image

ట్రంప్ నిర్ణయాలు విదేశీ విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నాయి. చిన్న పాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకూ వీసాలు రద్దు చేస్తున్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ దాడిలో హమాస్‌కు మద్దతుగా పోస్టులు పెట్టిన విద్యార్థుల వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల అధికారులు సైతం ఆకస్మిక వీసాల రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

News April 8, 2025

మంగపేట: దెబ్బతిన్న వరి పంటలను పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్

image

మంగపేట మండలం నరసింహసాగర్, మోట్లగూడెం, మల్లూరు గ్రామాల్లో ఉన్న కురిసిన భారీ వర్షాల కారణంగా 80% వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను మంగళవారం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, అధికారులు పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

error: Content is protected !!