News August 18, 2025
నిజాంపట్నం పోర్టుకు 3వ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం పోర్టుకు సోమవారం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 19, 2025
16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
News August 19, 2025
శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు

జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా నిరుద్యోగులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు.
News August 19, 2025
VZM: బార్ షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి

ఉమ్మడి జిల్లాలో నూతన మద్యం బార్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనాథుడు సోమవారం తెలిపారు. విజయనగరం జిల్లాలో 28, మన్యం జిల్లాలో 8 మద్యం బార్ షాపులకు ఈనెల 26 వరకు ఆన్‌లైన్ లేదా నేరుగా ఆయా జిల్లా కలెక్టరేట్లలో ఉండే సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు. ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు పైబడి వస్తేనే డ్రా తీస్తామని, లేదంటే గడువు పెంచుతామన్నారు.