News March 15, 2025

నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

Similar News

News November 13, 2025

బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యం- కలెక్టర్ సంతోష్

image

బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో, సమన్వయపూర్వకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News November 13, 2025

జిల్లా వ్యాప్తంగా పోలీసుల క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన

image

ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్, రోప్ పార్టీ విధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో పోలీసులు చాకచక్యంగా స్పందించేలా రియల్‌టైమ్‌ డెమోలు నిర్వహించారు. ప్రజా భద్రత కోసం సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.

News November 13, 2025

సూర్యాపేట: వేతనాలు విడుదల చేయాలి: పీఆర్టీయూ

image

2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఉపాధ్యాయ వేతనాల విడుదలకు డైరెక్టరేట్ నుంచి విడుదలైన జీవోను డీటీఓకు అందజేశారు. ఎస్టీఓలకు ఆదేశాలు జారీ చేసి వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు గోదేశి దయాకర్, ఫోరం అధ్యక్షుడు కోట రమేష్ పాల్గొన్నారు.