News March 29, 2025
నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

మద్యానికి బానిసై చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుల బాలకృష్ణయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఆరోగ్యం బాగా లేక వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News October 31, 2025
పంచ భూతాలే మానవ శరీరం

మానవ దేహం పంచభూతాలతో ఏర్పడింది. చర్మం, వెంట్రుకలు, కండరాలు భూతత్వానికి సంబంధించినవి. ఆకలి, నిద్ర, దాహం అగ్నితత్వానికి చెందినవి. నడవడం, పరుగెత్తడం వంటి కదలికలన్నీ వాయుతత్వం. మూత్రం, రక్తం, వీర్యం వంటి ద్రవాలు జలతత్వం కిందకి వస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఆలోచన (చింత), శబ్దం, దుఃఖం (శోకం) అనేవి ఆకాశతత్వం లక్షణాలు. నూనెతో తలకు, ఒంటికి చేసే అభ్యంగనం ద్వారా ఈ సర్వేంద్రియాలకు శాంతి, శక్తి లభిస్తాయి.
News October 31, 2025
5,346 టీచర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

ఢిల్లీలో 5,346 TGT పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.44,900 – రూ.1,42,400 అందుతుంది. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/
News October 31, 2025
HYD: పటేల్‌కు నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా HYDలోని గన్‌పార్క్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ దేశ అభివృద్ధితో పాటు సమైక్యత కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.


