News March 31, 2024

నిజాంసాగర్: నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల

image

నిజాంసాగర్‌లోని నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి జనవరి 20న పరీక్ష నిర్వహించారు. cbseit.in వెబ్ సైట్‌లో రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News September 8, 2025

నిజామబాద్: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి ఫిర్యాదులను విని పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.

News September 8, 2025

నిజామాబాద్: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

image

రాజీ మార్గమే ఉత్తమ మార్గమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్, చిన్నపాటి క్రిమినల్, సివిల్ వివాదాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు. కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

News September 8, 2025

కుప్పం బయలుదేరిన నిజామాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన 41 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గురువారం కుప్పం బయలుదేరారు. డీఈఓ అశోక్ ఆధ్వర్యంలో వీరంతా అగస్త్య ఫౌండేషన్ నిర్వహించే ‘మేక్ యువర్ ఓన్ ల్యాబ్’ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సైన్స్, మ్యాథ్స్‌లో ప్రయోగాత్మక పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఈ బృందానికి డీఈఓ అశోక్ వీడ్కోలు పలికారు.