News September 8, 2025
నిజాంసాగర్: నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 20,376 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని AEE సాకేత్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 27,352 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 TMCలు కాగా, ప్రస్తుతం 17.325 TMCలు నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువ ద్వారా పంటలకు1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 8, 2025
రేపటి లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: DIEO

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
News September 8, 2025
ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
News September 8, 2025
బీచ్ ఫెస్టివల్‌పై అధికారులతో కలెక్టర్ సమీక్ష

బాపట్లలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు రావాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బీచ్ ఫెస్టివల్‌పై అధికారులతో సమీక్ష జరిగింది. సూర్యలంక సముద్ర తీరం మరొక గోవాగా అభివృద్ధి చెందాలని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంతో బాపట్లలో వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. బావుడా ఛైర్మన్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.