News February 6, 2026
నిజాంసాగర్: పరీక్షా విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: DEO

నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశ పరీక్ష నిర్వహణపై గురువారం ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ సీతా రాంబాబు మాట్లాడుతూ.. పరీక్షా నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు పరీక్షా నిబంధనలు, పారదర్శకతపై DEO రాజు దిశానిర్దేశం చేశారు. పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేయాలన్నారు.
Similar News
News February 21, 2026
వికారాబాద్: రెండేళ్లుగా నిరాశ.. ఈసారైనా సాధించాలని..

గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో వికాబాదాబ్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. గతేడాది 73.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.
News February 21, 2026
NZB: వారినే కొనసాగిస్తారా?.. కొత్త వారికి అవకాశం ఇస్తారా?

నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన నేపథ్యంలో NZB జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్ – మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి – సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దాన్ – ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
News February 21, 2026
ఖమ్మం రెవెన్యూ శాఖలో 15 మందికి పదోన్నతులు

ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ట్రెసా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి 15 మందికి పదోన్నతులు రావడంతో శాఖలో ఉత్సాహం నెలకొంది.


