News February 1, 2025
నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా మూడో విడత నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ శివకుమార్ తెలిపారు. రెండో విడతలో ఇప్పటి వరకు 3.84 టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు. మూడో విడతలో 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Similar News
News February 1, 2025
బహిరంగంగా దూషణ జరిగితేనే SC, ST కేసు: సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది. అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3(1)(ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
News February 1, 2025
ఐర్లాండ్‌లో రొంపిచర్ల వాసి మృతి
రొంపిచర్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్ (26) ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు శుక్రవారం తెలిపారు. సురేష్ ఐర్లాండ్లో ఎమ్మెస్ చదవడానికి సంవత్సరం క్రితం వెళ్ళాడు. స్నేహితులతో కలిసి కారులో ముగ్గురితో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సురేష్‌తో పాటు విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన మరొకరు మృతి చెందినట్లు తెలిపారు.
News February 1, 2025
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్
అనకాపల్లి జిల్లాలో వచ్చేనెల ఐదు నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఇంటర్ అధికారులకు సూచించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.