News October 22, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగాల నుంచి స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 4,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారింది.

Similar News

News October 22, 2025

గద్వాల్: రోడ్డు కనెక్టివిటీకి అడుగులు..!

image

గద్వాల జిల్లా పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ.316.45 కోట్ల నిధులు మంజూరైనట్లు MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ➤ ఎరిగెర- అయిజ- అలంపూర్ రోడ్ రూ.9.61 కోట్లు ➤ గద్వాల-జమ్మిచేడు, పూడూరు x రోడ్, పుటాన్‌పల్లి, ఎర్రవల్లి) రూ.39.84 కోట్లు ➤ గద్వాల రాయచూర్ రూ.74.29 కోట్లు ➤ గద్వాల-అయిజ‌ రూ.24.32కోట్లు ➤ బల్గెర మాచర్ల రోడ్డు రూ.1.5కోట్లు ➤ గట్టు మాచర్ల రోడ్డు రూ.12.80 కోట్లు మంజూరయ్యాయి.

News October 22, 2025

తుని ఘటనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్

image

తుని మండలంలోని ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలికి సహాయం అందిస్తామని, హాస్టళ్లలో బాలికలకు భద్రత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.

News October 22, 2025

UPI ధమాకా.. రోజూ ₹94 వేల కోట్ల చెల్లింపులు

image

పండుగ సీజన్‌లో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరిగాయి. ఈ నెలలో రోజూ సగటున రూ.94 వేల కోట్ల లావాదేవీలు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువని తెలిపింది. ఈ నెలలో ఇంకా వారం రోజులకు పైనే ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో డిజిటల్ పేమెంట్స్‌లో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.