News September 23, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

image

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 70,787 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 15.778 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.

Similar News

News September 23, 2025

వెల్దండలో అత్యధిక వర్షపాతం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వెల్దండలో 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర మండలాల్లో నమోదైన వర్షపాతం మి.మీ.లలో వివరాలు ఇలా ఉన్నాయి.
తెలకపల్లి: 21.8
అమ్రాబాద్: 21.5
నాగర్‌కర్నూల్ మండలం (కుమ్మెర): 15.3
అమ్రాబాద్ (వెంకటేశ్వరపల్లి): 9.3
పదర, బల్మూరు (కొండారెడ్డిపల్లి): 8.0
వంగూరు: 5.3
అచ్చంపేట మండలం (ఐనోలు): 5.0
కోడేరు: 2.8

News September 23, 2025

బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్‌గా విశాఖ: కాటమనేని

image

విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, అదానీ, ఇన్ఫోసిస్, మౌరి టెక్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ITE&C కార్యదర్శి కటామనేని భాస్కర్ తెలిపారు. విశాఖను ‘బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కటంనేని స్పష్టం చేశారు.

News September 23, 2025

మరో 2 గంటల్లో వర్షం

image

తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న <<17794672>>హైదరాబాద్<<>> సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.