News August 27, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగిపోతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు 95,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 1,63,426 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 15.723 TMCలకు చేరింది. ప్రరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News August 28, 2025
అమెరికాలో భారత వస్తువుల ధరలు పెంపు!

భారత్‌పై ట్రంప్ <<17529585>>టారిఫ్<<>> ఎఫెక్ట్ అమెరికాలో ధరలపై ప్రభావం చూపుతున్నాయి. టారిఫ్ పెంపుతో భారత వస్తువుల ధరలు 40-50శాతం పెంచుతున్నట్లుగా అమెరికాలోని గ్రాసరీ షాపుల ఎదుట పోస్టర్లు వెలిశాయి. దీంతో ఎన్ఆర్ఐలు, భారతీయ స్టూడెంట్లపై భారం పడే అవకాశముంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ ట్రంప్ టారిఫ్ ఆంక్షలకు దిగారు. నిన్నటి నుంచి భారత్ ఎగుమతులపై 50శాతం టారిఫ్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News August 28, 2025
HYDలో ఎక్కడి నీరు అక్కడే ఇంకేలా హైడ్రా చర్యలు

ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా, ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు 100 లీటర్లు కురిస్తే అందులో 40 లీటర్లు భూమిలోకి ఇంకుతుంది. HYD నగరంలో ఇలాంటి పరిస్థితి లేదు. 98 లీటర్ల నీరు మురుగు కాలువల్లో కలుస్తోందని 2 లీటర్ల నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందని హైడ్రా ఓ రిపోర్టులో పేర్కొంది.
News August 28, 2025
సెల్యూట్ సర్(PHOTO)

TG: కామారెడ్డిలో <<17537949>>వరదలు<<>> జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు కాలనీలు నీట మునగగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారిని ఓ పోలీసు భుజాలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. విపత్తులో సామాన్యులను రక్షించిన పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.