News August 9, 2025
నిజాంసాగర్: రాహుల్ గాంధీకి రాఖీలు పంపిన చిన్నారులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజాంసాగర్ మండలానికి చెందిన చిన్నారులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాఖీలు పంపారు. ” భారత్ కి బేటియోంకీ బాయ్ – నారి సురక్ష కా రక్షక్ రాహుల్ బయ్యా” అనే భావనతో రాఖీలు పంపించినట్లు కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇమ్రోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News August 10, 2025
ఛత్తీస్‌గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. ట్విస్ట్ ఏంటంటే?

ఛత్తీస్‌గఢ్‌లో మనీశ్ అనే యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్ చేశారు. అతడు వాడుతున్న మొబైల్ నంబర్ గతంలో RCB కెప్టెన్ రజత్ పాటీదార్ ఉపయోగించడమే కారణం. 6 నెలలపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉండటంతో నంబర్‌ను మనీశ్‌కు కేటాయించింది కంపెనీ. ఈ విషయం కాస్తా పోలీసులకు చేరడంతో యువకుడి నుంచి సిమ్ తీసుకొని రజత్ పాటీదార్‌కు అప్పగించారు. తాను కోహ్లీ ఫ్యాన్ అని మనీశ్ చెప్పడం విశేషం.
News August 10, 2025
79 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

అనంతపురంలోని క్లాక్ టవర్ నుంచి 79 అడుగుల జాతీయ జెండాతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విశ్వవిద్యాలయం తరుపున హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
News August 10, 2025
మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్‌లో సర్కారు విఫలం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ అమలులో సర్కార్ విఫలమైందని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. వరద తొలగింపులకు కాంగ్రెస్ సర్కారం వింత చేష్టలు చేస్తుందన్నారు. నీరు పోవడానికి బ్రిడ్జిలకు డ్రిల్ చేయడం సిగ్గుచేటు అన్నారు. బ్రిడ్జిలకు డ్రిల్ చేస్తే బలానికి వాడే రబ్బర్లు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో నగరవాసులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.