News September 15, 2025
నిజాంసాగర్: 5 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 33,910 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ సోమవారం రాత్రి తెలిపారు. ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 17.397 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
Similar News
News September 16, 2025
జగిత్యాల: చిన్నారుల మహిళలకు పోషణ మహోత్సవ కార్యక్రమం

చిన్నారుల మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు సమగ్ర శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు చక్కెర, ఉప్పు, నూనెల వాడకం పరిమితిపై ప్రచార కార్యక్రమాలు జరిపించనున్నట్లు పేర్కొన్నారు.
News September 16, 2025
పెద్దపల్లిలో సమావేశమైన బీజేపీ నేతలు

సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా పఖ్వాడా కార్యక్రమాలపై పెద్దపల్లి జిల్లా నేతలు నేడు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా స్వదేశీ, ఆత్మనిర్భర్ సందేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. వీటిలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్ల మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News September 16, 2025
డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.