News June 22, 2024
నిజాం నగలు.. హైదరాబాద్‌కు తేవాలని డిమాండ్!

నిజాం నగలను HYDకు తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వజ్రాభరణాలను భద్రపరిచారు. 2001, 2006లో వీటిని నగరంలోనూ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తే నగలు ఇక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది లేదని గతంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాలార్‌జంగ్ మ్యూజియంలో వీటిని ప్రదర్శిస్తే బాగుంటుందని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News September 18, 2025
HYD: సైకిళ్లపై తిరుగుతూ.. తామున్నామంటున్న మహిళా పోలీస్

నాగోల్ PS పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మహిళా పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వీధుల్లోకెళ్లి తెలుసుకున్నారు. గృహహింస, వేధింపులు, అవాంఛనీయ ప్రవర్తన, మద్యం మత్తులో అల్లర్ల సమస్యలపై అవగాహన కల్పించారు. ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలిచి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డయల్ 100, 112, షీ టీమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని స్థానికులకు సూచించారు.
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
News September 15, 2025
HYD: రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్

మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.