News March 10, 2025
నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
Similar News
News March 10, 2025
NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్‌కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.
News March 10, 2025
సిరికొండ: వడ్డీ వ్యాపారుల వేధింపులకు యువకుడి బలి

సిరికొండ మండలం ముషిరునగర్‌కు చెందిన మనోహర్ నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన జ్యోతి వద్ద ఆరు నెలల క్రితం రూ.40వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.80వేలు చెల్లించాలని మనోహర్‌పై కొద్దికాలంగా జ్యోతి మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్ళారు. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 10, 2025
వేల్పూర్: బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ

నిజామాబాద్ వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. ఇండియా జట్టు ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు నవీన్ తెలిపాడు. నవీన్‌ను గ్రామ ప్రజలు, క్రీడాకారులు, తోటి స్నేహితులు అభినందించారు.