News March 23, 2025
నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 28, 2026
NZB: గోడౌన్‌లు సిద్ధం చేయాలి

ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు అని ఆరా తీశారు.
News February 28, 2026
ఎడపల్లి: క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యం: జిల్లా జడ్జి

క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని NZB జిల్లా జడ్జి భరత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. పోలీస్ శాఖ, న్యాయ విభాగం సభ్యులు నిత్యం ఎంతో బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
News February 28, 2026
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.


