News December 19, 2024

నిజామాబాదు: ఉమ్మడి జిల్లాలో నిలకడగా చలితీవ్రత

image

ఉమ్మడి NZB జిల్లాలో ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండి చలితీవ్రత తగ్గిందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా మేనూర్ 8.5, జుక్కల్ 9.6, గాంధారి 9.9, నసురుల్లాబాద్ 10, బిచ్కుంద, రామలక్ష్మణపల్లిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో గోపన్ పల్లి 10.2, కోటగిరి 10.3, సాలురా 10.4, మెండోరా 10.5, చందూర్ 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News February 1, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానల్‌లో కెమెరామ్యాన్ పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 1, 2025

నిజామాబాద్ జిల్లా వెదర్ అప్డేట్@8AM

image

నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా పోతంగల్లో 17℃, నిజామాబాద్ 17.1, మోస్రా 17.2, జకోరా 17.3, మోర్తాడ్ 17.4, యడపల్లి 17.5, సాలూరా 17.6, పల్డా, మల్లాపూర్ 17.7, గోపన్నపల్లి, ఏర్గట్ల, జానకంపేట్ 17.8, చందూర్ 17.9, మెండోరా, కొటగిరి, చిన్న మవంది, డిచ్‌పల్లి, చకొండూరు, కల్లూరి 18, లక్స్మాపూర్, బెల్లాల్, గన్నారం, నిజామాబాద్ పట్టణంలో 18.1℃గా నమోదయ్యాయి.

News February 1, 2025

రుద్రూర్: బట్టలు ఉతకడానికి వెళ్లి యువకుడి దుర్మరణం

image

రుద్రూర్ మండలం అక్బర్ నగర్ చెరువులో శుక్రవారం రాత్రి JNC కాలనీకి చెందిన సాజన్(36) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గురువారం సాయంత్రం బట్టలు ఉతకాడానికి బైక్ పై వెళ్లిన సాజన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా చెరువులో మృతదేహం లభించింది. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు