News March 19, 2024
నిజామాబాద్‌లో ఈ నంబర్‌కు రూ. లక్ష..!

నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించారు. దీంతో రూ.9,69,872 ఆదాయం వచ్చింది. NZBకు టీజీ 16 0001, ఆర్మూర్‌కు టీజీ 16 ఏ 0001, బోధన్‌కు టీజీ 16B 0001 నంబర్లను కేటాయించారు. ఇందులో టీజీ 16A 0001 నంబర్ కోసం ఓ వాహనదారుడు రూ.లక్ష చెల్లించాడు. టీజీ 16 0789కు రూ.52,665, టీజీ 16 0001కు రూ.50 వేలు, టీజీ 16B 0333 నంబర్ రూ. 30వేల ధర పలికింది.
Similar News
News April 3, 2025
NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

వర్ని(M) జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి గురువారం పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు. ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా అని ఆరా తీశారు.
News April 3, 2025
నిజామాబాద్: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. బుధవారం గోపనపల్లెలో 37.6℃ నమోదైంది. వైల్పూర్ 37.3, మోస్రా 37.2, పెర్కిట్ 37, కోటగిరి 36.8, వేంపల్లి 36.6, యర్గట్ల, యడపల్లి 36.5, లక్ష్మాపూర్ 36.3, మల్కాపూర్ 36.2, ముప్కాల్, నిజామాబాద్ 36.1, ఆలూరు, బాల్కొండ 36, మెండోరా, భీంగల్, ఇస్సాపల్లి 35.9, మగ్గిడి 35.7℃ నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి.
News April 3, 2025
NZB: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. SHARE IT.