News January 22, 2026
నిజామాబాద్‌లో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్ నగరం ముజాహిద్ నగర్‌లో గురువారం కత్తిపోట్ల కలకలం రేపింది. స్థానికంగా పిల్లలు ఆడుకుంటున్న సమయంలో వారి మధ్య మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. అక్కడే ఉన్న జహీర్ గొడవను ఆపేందుకు ప్రయత్నించగా, ఆగ్రహం చెందిన కొందరు కత్తితో దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన జహీర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 5, 2026
కర్నూలులో పడిపోయిన ధరలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధరలు పడిపోయాయి. క్వింటా గరిష్ఠంగా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8 వేల లోపు పడిపోయింది. కనిష్ఠ ధర రూ.2,609, గరిష్ఠ ధర రూ.7,901కు అమ్ముడుపోయాయి. నిన్న మార్కెట్‌కు 3,655 క్వింటాళ్ల కందులు వచ్చాయి.
News February 5, 2026
HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? ఇలా చేయండి..!

రైలులో ప్రయాణిస్తున్నారా..? ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా..? వెంటనే 139కు కాల్ చేసి సమాచారం అందించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. అంతేకాకుండా Railmadad యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ పోగొట్టుకున్నా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని DRM గోపాలకృష్ణన్ సూచించారు.
News February 5, 2026
పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.


