News July 18, 2024

నిజామాబాద్‌లో కాసేపట్లో DSC పరీక్ష

image

రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు గురువారం ప్రారంభమై ఆగస్టు 7వరకు జరగనున్నాయి. కాగా జిల్లాలో 640 పోస్టులకు 7వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లోని నాలెడ్జి పార్క్ స్కూల్‌లో 2,600 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. >> ALL THE BEST

Similar News

News December 24, 2025

NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్‌’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

News December 24, 2025

NZB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు NZB జిల్లా గురుకుల పాఠశాలల సీనియర్ ప్రిన్సిపల్ గోపిచంద్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News December 24, 2025

నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్: వర్ని SI

image

వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వర్నిSI రాజు తెలిపారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతో పాటు అతని తమ్ముడు నరేడ్ల శంకర్, అఫంధి ఫారానికి చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్, ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9.86 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.