News June 25, 2024
నిజామాబాద్‌లో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె

నిజామాబాద్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రెండో రోజు మంగళవారం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News February 15, 2026
NZB: యథావిధిగా ప్రజావాణి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు.
News February 15, 2026
NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.
News February 15, 2026
NZB: అక్కడ పోలీసులకు ఏం పని? : MP అర్వింద్

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కాంగ్రెస్‌కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


