News June 26, 2024

నిజామాబాద్‌‌లో దారుణ హత్య.. వివరాలు ఇవే!

image

నిజామాబాద్‌లో వ్యక్తి <<13508067>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. ధర్మపురి హిల్స్ ప్రాంతంలోని రంజానీ బాబా దర్గా ప్రాంతంలో హాసన్(50)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి హత్య జరిగిందని, దర్గా నిర్వహణలో వచ్చే డబ్బుల కారణంగా అతడిని హత్యచేసి ఉండవచ్చని సీఐ సురేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

Similar News

News February 10, 2026

NZB: రైలులో గుర్తుతెలియని మహిళ మృతి

image

నాందేడ్- మేడ్చల్ డెమో రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సుమారు 70 ఏళ్ల మృతురాలు సహజంగానే తుదిశ్వాస విడిచినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఆమెకు సంబంధించిన ఆనవాళ్లు ఏవి లేవన్నారు. మృతురాలిని గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే ఎస్సై ఫోన్ నంబర్‌ను 8712658591 సంప్రదించాలని సూచించారు.

News February 10, 2026

NZB: ‘సైలెన్స్‌ పీరియడ్‌’ అమల్లో ఉంది!

image

ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరూ పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, పత్రికా సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అనుమతి కలిగిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి ఉందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

News February 10, 2026

NZB: సాయంత్రం 5 వరకు లైన్‌లో ఉన్నవారికి టోకెన్‌లు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు టోకెన్‌లు అందజేస్తామని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.