News September 23, 2025
నిజామాబాద్‌లో భారీ చోరీ

నిజామాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. నాగారంలోని బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉండే పవన్ శర్మ సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి పూజకు వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు వచ్చి తాళం పగల గొట్టి ఇంట్లోకి చొరబడి లాకర్‌ను ధ్వసం చేసి అందులోని 30 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. 5వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 23, 2025
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు 3,01,321 క్యూసెక్కుల

SRSP నుంచి 3,01,321 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,52,225 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 72.23 TMCల నీరు నిల్వ ఉంది.
News September 23, 2025
నిజామాబాద్: డా.కాసర్ల, చందన్ రావులకు కాళోజీ జాతీయ పురస్కారం

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు డా.కాసర్ల నరేష్ రావు, వ్యాఖ్యాత చందన్ రావులకు సోమవారం కాళోజీ జాతీయ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వసుంధర ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఏనుగు నరసింహ రెడ్డి, ఫౌండేషన్ ఛైర్మన్ మధుకర్, రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి బాల చారి పాల్గొన్నారు.
News September 23, 2025
హైదరాబాద్‌పై నిజామాబాద్ విజయం

వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన 11వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానం, పురుషుల జట్టు తృతీయ స్థానం సాధించిందని NZB జిల్లా సేపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి తెలిపారు. మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు.