News January 21, 2026
నిజామాబాద్‌లో మున్సిపల్ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44 వార్డుల రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఖరారులో నిబంధనలు పాటించలేదని పి.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి మూడు రోజుల్లోగా రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా పడింది
Similar News
News January 31, 2026
NZB: జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మెడల్స్

జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు మెడల్స్ సాధించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరుగుతున్న 7వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో దినేష్ 40 ఏళ్ల కేటగిరిలో లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. 45 ఏళ్ల కేటగిరిలో రఘువీర్ షాట్ పుట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
News January 31, 2026
NZB: ముగ్గురికి జైలు.. 14 మందికి జరిమానా

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 14 మందికి రూ.1.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.