News January 27, 2025

నిజామాబాద్‌లో శునకాలకు బారసాల

image

నిజామాబాద్ నగర శివారులోని మాణిక్‌భండార్‌లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్, మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాటికి ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

Similar News

News January 28, 2025

NZB: నీలకంఠేశ్వర స్వామి రథం గురించి తెలుసా?

image

సుదీర్ఘ చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయం విమాన రథం విశేష పేరుగాంచింది. ఏగిన కలపతో రూపుదిద్దుకున్న రథం ఎత్తు 28 అడుగులు, వెడల్పు 11 అడుగులు దేవుళ్ల చిత్ర పటాలు, ఏనుగులు, గుర్రాల బొమ్మలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఈ విమాన రథాన్ని సోమవారం నుంచి ముస్తాబు చేస్తున్నట్లు ఆలయ ఈవో యస్.రవీందర్ తెలిపారు.

News January 28, 2025

ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్

image

ఆర్మూర్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఆయనను మున్సిపల్ కమిషనర్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  సన్మానించి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News January 27, 2025

NZB: ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్‌కు పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.