News January 29, 2026

నిజామాబాద్‌లో MIM కీ ‘రోల్’

image

నిజామాబాద్‌లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు AIMIM ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించిన MIM.. 28 స్థానాలు సాధించిన BJPకి చెక్ పెడుతూ 13 స్థానాలు సాధించిన BRSతో పొత్తు పెట్టుకుంది. దీంతో మొహమ్మద్ ఇద్రీస్ ఖాన్ (AIMIM) డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవగా ఈ సారి కూడా తమ సత్తా చాటాలని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

Similar News

News January 31, 2026

నేడు వనప్రవేశం.. ముగియనున్న మేడారం మహాజాతర

image

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన వనప్రవేశం నేడు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య బృందం గద్దెల వద్ద రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తంతు ముగించి, తల్లి రూపమైన కుంకుమ భరిణెను తీసుకుని పూజారులు చిలుకలగుట్టకు బయలుదేరుతారు. దీంతో నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన గిరిజన కుంభమేళాకు తెరపడనుంది.

News January 31, 2026

NZB: కార్పొరేటర్ అభ్యర్థి రూ. 7.50 కోట్ల పన్ను చెల్లింపు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థకు కాసుల వర్షం కురిసింది. ఎన్నికల నేపథ్యంలో పాత బకాయిలన్నీ వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో పోటీ చేసే అభ్యర్థులు పాత బకాయిలు కడుతున్నారు. ఇందులో భాగంగా నిన్న 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శమంత నరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఆస్తి పన్ను రూ. 7.50 కోట్లు చెల్లించారు.

News January 31, 2026

NZB: నేడు నామినేషన్ల పరిశీలన

image

నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ ఎన్నికల సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 వార్డులకు 3 రోజుల్లో 1,231 నామినేషన్లు రాగ భీంగల్ 12 వార్డుల్లో 113, బోధన్ 38 వార్డుల్లో 342, ఆర్మూర్ 36 వార్డుల్లో 298 నామినేషన్లు వచ్చాయి.