News April 14, 2024

నిజామాబాద్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివ‌రాలు:
నిజామాబాద్: 98490 73809
కామారెడ్డి: 96666 77786
ఆర్మూర్: 96405 73060

Similar News

News April 2, 2026

NZB: కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి: ఎంపీ సురేశ్ రెడ్డి

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం పైసా సాయం చేయకున్నా, కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వాస్తవ విరుద్ధమైన మాటలు ఉపసంహరించుకోకుంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించారు.

News April 2, 2026

నిజామాబాద్: హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు పర్యవేక్షించిన సీపీ

image

నిజామాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన శోభాయాత్ర బందోబస్తును సీపీ సాయి చైతన్య గురువారం పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, తదితరులు ఉన్నారు.

News April 2, 2026

మోస్రా: పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గురువారం మోస్రాలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.