News October 13, 2025

నిజామాబాద్: అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు

image

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.

Similar News

News October 13, 2025

నిజామాబాద్‌లో సంఘటన్, సృజన్ అభియాన్

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సంఘటన్, సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా నాయకత్వం ఎంపిక ప్రక్రియ కోసం కాంగ్రెస్ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News October 13, 2025

నిజామాబాద్: ‘ఈ నెల 18న బంద్‌కు సహకరించాలి’

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 18న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కోరారు. సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌కు సోమవారం సాయంత్రం వినతిపత్రం అందించారు. రిజర్వేషన్లకు వివిధ రాజకీయ పార్టీల తీరుకు నిరసనగా బంద్ చేపడుతున్నట్లు చెప్పారు. అగ్రవర్ణాల వారు బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకుంటున్నారన్నారు.

News October 13, 2025

నిజామాబాద్: 8వ జాతీయ పోషణ మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

image

8వ జాతీయ పోషణ మాసం 2025 సందర్భంగా సోమవారం IDOC సమావేశ మందిరంలో పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ నెల 16న జరిగే సమావేశం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల శాఖా జిల్లా అధికారిణి రసూల్ బీ పాల్గొన్నారు.