News January 29, 2025

నిజామాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో​ అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన మారుతి నగరంలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సాయినగర్ ​రోడ్​ నంబర్-1​లో మంగళవారం మారుతి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 20, 2026

నిజామాబాద్ కా ‘రాణి’..!

image

మున్సిపల్ ఎన్నికల వరకు ఆమె ఓ సాధారణ మహిళ. రాజకీయాలు అస్సలు తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో NZB 49వ డివిజన్ నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ లభించింది. కనీసం ప్రచారంలో సైతం పేరు వినిపించని ఆమె గెలుపొంది అనూహ్యంగా నగర ప్రథమ పౌరురాలి స్థానం పొందారు. ఆర్మూర్‌కు చెందిన జర్నలిస్ట్ బెడిద రాజేశ్వర్‌రావు కూతురు, కరాటే రమేశ్ భార్య ఉమారాణి. నేడు ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 20, 2026

NZB: నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్

image

నిజామాబాద్ నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.

News February 19, 2026

పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఇవి పాటించాల్సిందే: సీపీ

image

పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు. ఫోన్లో ‘చైల్డ్ సెట్టింగ్ టూల్స్’ వాడాలని చెప్పారు.