News November 22, 2025

నిజామాబాద్: అన్న ప్రమాణ స్వీకారం.. తమ్ముడు వస్తారా..?

image

నిజామాబాద్ జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. రేపు నిజామాబాద్ మున్నూరు కాపుల జిల్లా అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ పెద్ద కొడుకు, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన తమ్ముడు ధర్మపురి అరవింద్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనే చర్చ మొదలైంది. ఎంపీ అరవింద్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు కూడా ఆహ్వానం పంపారు.

Similar News

News November 23, 2025

ఊట్కూర్: తెలంగాణ ఉద్యమ నాయకుడి మృతి

image

ఊట్కూర్ మండలంలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాలే బాలప్ప (48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో శస్త్రచికిత్స జరిగింది. అస్వస్థత గురై పరిస్థితి విషపించడంతో తుదిశ్వాస విడిచారు. 2001 మలిదశ ఉద్యమంలో రైలు రోకో, రాస్తారోకో, సకలజనుల సమ్మె వంటి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. పలువురు సంతాపం తెలిపారు.

News November 23, 2025

సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

News November 23, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.