News November 17, 2025

నిజామాబాద్ అమ్మాయికి ‘బాలరత్న-2025’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభశ్రీ ‘మల్టిపుల్ టాలెంట్ గర్ల్’, ‘బాలరత్న – 2025’ అవార్డులను అందుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విభ శ్రీ.. శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ పాటలు, పలు టీవీ షోలు, చలనచిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీనటి ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా ఈ బాలకళాకారిణి అవార్డును స్వీకరించింది.

Similar News

News November 17, 2025

లింగంపేట: భర్తకు దాహన సంస్కారాలు చేసిన భార్య

image

భర్త గుండె పోటుతో మృతి చెందడంతో భార్య దహన సంస్కారాలు నిర్వహించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన బాలయ్య ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు కొడుకు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలయ్య భార్య సత్యవ్వ దహన సంస్కారాలు నిర్వహించింది. గ్రామంలో అంతిమయాత్రను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టారు.

News November 17, 2025

నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్

image

తనకు దేవుడంటే నమ్మకం లేదంటూ <<18300800>>రాజమౌళి<<>> చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్న వేళ ఆయన పాత ట్వీట్ వైరల్ అవుతోంది. 2011లో ఓ అభిమాని జక్కన్నకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘థాంక్యూ. కానీ నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడు నా ఫేవరెట్’ అని రిప్లై ఇచ్చారు. మరి రాముడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News November 17, 2025

సంగారెడ్డిలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

image

సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు కట్ట హనుమాన్ మంత్రం సమీపంలో సోమవారం తెల్లవారుజామున అద్భుత దృశ్యం ఆవిష్కర్తమైంది. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పసుపు పచ్చని కాంతులతో పంట పొలాలు మారాయి. ఈ అద్భుత ఘట్టాన్ని కొందరూ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సూర్యుడిని చూసేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు.