News March 5, 2025
నిజామాబాద్: అలీసాగర్ లిఫ్ట్ కాల్వలో శవం లభ్యం

ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల అలీసాగర్ లిఫ్ట్ కాల్వ తూము వద్ద వ్యక్తి శవం లభ్యమవడం కలకలం లేపింది. అలీసాగర్ లిఫ్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Similar News
News March 5, 2025
రుద్రూర్: చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు(45) అనే వ్యక్తి మంగళవారం స్థానికంగా ఉన్న గుండ్లవాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న బుధవారం తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News March 5, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎడపల్లి మండల ఠాణకలాన్ గ్రామ శివారులోని పోలీస్ ట్రైనింగ్ క్యాంపు ఎదుట బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఠాణకలాన్‌కు చెందిన మెట్టు శ్రీనివాస్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు గ్రామానికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News March 5, 2025
NZB: మొదటి రోజు 753 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు DIEO రవికుమార్ తెలిపారు.జిల్లాలో 19,191 మంది విద్యార్థులకు 18,438 మంది పరీక్షలకు హాజరయ్యారు. 753 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. 96.1 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలి రోజు పరీక్ష ముగిసింది. 57 పరీక్ష కేంద్రాలకు, 50 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.