News April 10, 2025

నిజామాబాద్: ఆపరేషన్ చబుత్రా.. మళ్లీ స్టార్ట్

image

నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ‘ఆపరేషన్ చబుత్రా’ మళ్లీ ప్రారంభమైంది. నగరంలోని రోడ్లపై అర్ధరాత్రి వేళ తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కొంత కాలం పక్కాగా అమలు చేసి తర్వాత వదిలేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఇటీవల మళ్లీ ఆపరేషన్ చబుత్రా ను షురూ చేశారు. మంగళవారం సాయంత్రం NZB శాంతి నగర్‌లో యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Similar News

News October 30, 2025

రద్దు చేసిన బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం: డీపీటీవో

image

తుఫాన్ నేపథ్యంలో తూ.గో జిల్లాలో రద్దు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీస్‌లను పునరుద్ధరించినట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా.. ఇటు ఆర్టీసీ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బస్సు సర్వీసులను రద్దు చేశామన్నారు. తుఫాను తీరం దాటడంతో జిల్లాలో నడుస్తున్న 219 సర్వీస్‌లు గురువారం నుంచి పూర్తిస్థాయిలో నడవనున్నట్లు డీపీటీవో వెల్లడించారు.

News October 30, 2025

పల్నాడు: ధర్మకర్తల నియామకానికి నోటిఫికేషన్

image

నరసరావుపేటలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైందని ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర రావు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టానికి లోబడి నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తిగల హిందూ అభ్యర్థులు 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

News October 30, 2025

పత్తిలో 20% తేమ ఉన్నా కొనండి.. CCIకి లేఖ

image

TG: భారీ వర్షాల నేపథ్యంలో పత్తిలో 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని CCIకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ మల్లు రవి లేఖ రాశారు. తేమ పెరగడం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రబీ సీజన్ కోసం నెలకు 2 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కాగా క్షేత్రస్థాయిలో పత్తిలో 12% తేమ దాటితే <<18118478>>మద్దతు ధర<<>> దక్కడం లేదు.